Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

అతి చేస్తే మరో జలసంధిని మూసేస్తాం.. ఇంతకు మించిన సంక్షోభం చూస్తారు: అమెరికాకు

హర్మూజ్ జలసంధిని మూసేసి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఇరాన్ మరో సంచలన ప్రకటన చేసింది. హార్మూజ్ లాంటి మరో అతిపెద్ద జలసంధిని మూసేస్తామని హెచ్చరించింది.
అదే జరిగితే ఇక ప్రపంచం మొత్తం స్తంభిస్తుందంటూ వార్నింగ్ ఇచ్చింది. హార్మూజ్ ప్రభావం ప్రపంచ దేశాలు చూస్తున్నాయని.. మళ్లీ తమపై దాడికి అమెరికా వస్తే మరో అంతకు మించిన విపత్తు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

ప్రపంచంలో చమురు సరఫరాలో నాల్గవ అతిపెద్ద నౌకా మార్గం అయిన బాబ్ ఎల్ మందెబ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ హెచ్చరించడం ఆందోళనకరమైన విషయం. హార్మూజ్ జలసంధి 5వ అతిపెద్ద ఆయిల్ సరఫరా జరిగే మార్గం. దానికంటే అధికంగా బాబ్ ఎల్ మందెబ్ జలసంధిగుండా రవాణా జరుగుతుంటుంది.

ఈ జలసంధి యెమెన్ కు నైరుతి (సౌత్ వెస్ట్) వైపు ఉంటుంది. హౌథీస్ డామినేషన్ ఉండే ప్రాంతం ఇది. అమెరికా ఇలాగే రెచ్చగొడితే హౌథీస్ ఈ జలసంధిని స్వాధీనం చేసుకుంటారని ఇరాన్ హెచ్చరిస్తోంది. హౌథీస్ ఆర్థిక, ఆయుధ సంపత్తిని అందించే ఇరాన్.. వారి సహకారంతో జలసంధిని మూసేస్తామని.. అప్పుడు ప్రపంచం మరింత సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.

బాబ్ ఎల్ మందెబ్ జలసంధి (Bab el-Mandeb Strait) :

బాబ్ ఎల్ మందెబ్ జలసంధి.. ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన వాటిలో ఒకటి. ఎర్ర సముద్రం (రెడ్ సీ) నుంచి గల్ఫ్ ఆఫ్ అడెన్, హిందూ మహా సముద్రాన్ని కలుపుతుంది. యూరోప్, ఆసియా ఖండాల మధ్య సూయెజ్ కాలువ గుండా ప్రయాణించే నౌక ఏదైనా బాబ్ ఎల్ మండేబ్ నుంచి వెళ్లాల్సిందే.

బాబ్ ఎల్ మండేబ్ మూసివేస్తే ఏమవుతుంది..?

ఒక వేళ బాబ్ ఎల్ మండేబ్ సంధిని మూసివేస్తే ప్రపంచ రవాణా మరింత క్లిషతరంగా మారుతుంది. సూయెజ్ కాలువ ద్వారా ఈ జలసంధిని దాటకుండా వెళ్లాలంటే నౌకలకు ఉన్న ఏకైక మార్గం కేప్ ఆఫ్ గుడ్ హోప్ (Cape of Good Hope). ఇది ఆఫ్రికా ద్వీపకల్పం దగ్గర ఉంటుంది. ఇలా వెళ్లాలంటే రవాణాకు 20 నుంచి25 రోజులు పడుతుంది. ఇక ఆసియా-యూరోప్ రవాణాకు 30 నుంచి 40 రోజులు పడుతుంది. అదనంగా 10 నుంచి 15 రోజులు పడుతుందని చెబుతున్నారు.

►ALSO READ | ఈ 5 దేశాలకు మాత్రమే ఇరాన్ ఎందుకు అనుమతి ఇచ్చింది.. కారణాలు ఏంటీ..?

ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం ఈ సంధిగుండా జరుగుతుంది. అదే విధంగా సముద్రం నుంచి వెలికితీసే క్రూడ్ ఆయిల్, లాగే గ్యాస్ (LNG) 10 శాతం ఈ కారిడార్ గుండానే రవాణా జరుగుతంది. 2023 లో ఒక రోజుకే 8.8 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్, గ్యాస్ రవాణా జరిగినట్లు అమెరికా ఇంధన శాఖ పేర్కొంది. 2014 లో సనాను టేక్ ఓవర్ చేసిన తర్వాత.. ఎర్రసముద్రం మీద ఆధిపత్యం హౌథీలదే ఉంది.

ఒకవేళ బాబ్ ఎల్ మండేబ్ ను స్వాధీనం చేసుకోవడంలో హౌతీలు సక్సెస్ అయితే.. అది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద విపత్తుగా పరిణమించే అవకాశం ఉంది. ఇప్పటికే హార్మూజ్ జలసంధి మూసివేతతో ఇంధన కొరతతో కొన్ని దేశాల్లో ప్రజలు వంటలు చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఇక ఈ జలసంధి కూడా మూతపడితే మరింత సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related posts

ట్రంప్‌కు టారిఫ్‌లు విధించే అధికారాల్లేవ్‌.. కోర్టు సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

కిరానా హిల్స్‌లో అమెరికా అణుస్థావరం!

M HANUMATH PRASAD

1971 నాటి దాడికి ప్రతీకరమా — పెద్ద జోక్

M HANUMATH PRASAD

సింధు ఒప్పందంపై భారత్ కు అంతర్జాతీయ కోర్టు షాక్-తోసిపుచ్చిన కేంద్రం..!

M HANUMATH PRASAD

మిత్రులు రమ్మంటే రావడంలేదు, మాకు కావల్సినంత ఆయిల్ వుంది, మీరెట్లా పోతే మాకేం: ట్రంప్

M HANUMATH PRASAD

మరో 48 గంటల్లో మరణించనున్న 14 వేల చిన్నారులు

M HANUMATH PRASAD