Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

ఇండియాలో పట్టుబడ్డ బంగ్లాదేశీలను సొంతదేశానికి తరలింపు

ఇండియా పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ పౌరులను మోడీ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయలను చాలా మందిని పోలీసులు గుర్తించారు.

కాగా తాజాగా అలా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల్లో మొదటి బ్యాచ్‌ను అధికారులు రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు తరలించారు. మూడు వ్యానుల్లో పోలీసుల సెక్యురిటీ నడుమ వారిని జోద్ పూర్ తరలించగా అక్కడ నుండి వారిని బంగ్లాదేశ్‌కు తరలించనున్నారు. మరోవైపు బెంగాల్‌లో చాలా మంది బంగ్లాదేశీలు అక్రమంగా తరలివచ్చి నివసిస్తున్నారే ఆరోపణలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. అక్రమంగా తరలివచ్చిన విదేశీయులతో ఎప్పుడు ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందో తెలియదని ఆందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని భారత్ సీరియస్‌గా తీసుకుంది. వారందరినీ గుర్తించి సొంత దేశానికి తరలించే చర్యలు చేపడుతోంది.

Related posts

పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ దారుణ హత్య..?- ఎంత వరకు నిజం?

M HANUMATH PRASAD

ట్రంప్‌కు టారిఫ్‌లు విధించే అధికారాల్లేవ్‌.. కోర్టు సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

జమ్ముతో సహా పలు ఎయిర్పోర్ట్ ల మీద దాడికి తెగబడ్డ పాక్ సైన్యం

పాక్ తరుఫున పోరాడిన తుర్కియే సైనికులు.. ఇద్దరు హతం.. తీవ్ర కలకలం

M HANUMATH PRASAD

సుప్రీంకోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన ట్రంప్

M HANUMATH PRASAD

పాక్ పై బెహ్రెయిన్ లో చెలరేగిన ఒవైసీ.. ఈ హెచ్చరిక పీక్స్!

M HANUMATH PRASAD