Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

ప్రియుడితో దగ్గరుండి పెళ్లి చేసిన భర్త.. వీడియో వైరల్..

ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో వివాహేతర సంబంధం ఘటన తెర మీదకు వచ్చింది.

యోగేష్ తివారీ (40)కి, సోని (30)తో 2010లో వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, కన్నౌజ్‌కు చెందిన వికాస్ ద్వివేది (35) అనే వ్యక్తితో సోనికి కొంతకాలంగా ఎఫైర్ నడుస్తుంది.

భర్త పలు మార్లు దీనిపై భార్యకు నచ్చ చెప్పాడు. కానీ ఆమె మాత్రం విన్పించుకోలేదు. ఈక్రమంలో ఇటీవల వీరి మధ్య గొడవలు పీక్స్ కు వెళ్లిపోయాయి. ఇటీవల సోని తన పుట్టింటికి వెళ్లి, సోమవారం తిరిగి భర్త ఇంటికి వచ్చింది. అదే రోజు వికాస్ కూడా వారి గ్రామానికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వికాస్‌ను గమనించిన యోగేష్.. అక్కడ కూడా ఇద్దరు కలుసుకున్నారా అంటూ గొడవలకు దిగాడు.

వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. గ్రామ పెద్దలతో పంచాయతీ ఏర్పాటు చేయించాడు.సోనీ తన ప్రియుడితో ఉండేందుకు ఇష్టపడుతు తన మనసులోని మాటను చెప్పింది. ఈ క్రమంలో యేగేష్ సైతం.. తన 15 ఏళ్ల బంధానికి బ్రేకప్ చెప్పేశాడు. అందరి ముందు.. తన భార్యకు, ఆమె ప్రియుడికి దగ్గరుండి మరీ పెళ్లి చేయించాడు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. నువ్వు గ్రేట్ భయ్యా.. కనీసం ప్రాణాలు అయిన మిగిలాయని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.మరికొంత మంది పోతే పోనీలే..నువ్వు హ్యాపీగా ఉండొచ్చని కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నారు.

Related posts

రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన ప్రాపర్టీ మీ సొంతం కాదు…సుప్రీం కోర్టు తాజా తీర్పు ఏం చెబుతోంది..

M HANUMATH PRASAD

ఓహో.. ఇప్పుడు దొరికావా! రెండేళ్ల క్రితం మాయమైన భార్యను ఓటు వేసే చోట చూసి భర్త ఏం చేశాడో తెలుసా?

M HANUMATH PRASAD

కాంగ్రెస్ ఎంపీ పాక్ పర్యటనపై రచ్చ.. రాజీనామాకు సిద్ధమేనన్న సీఎం

M HANUMATH PRASAD

పేలిన సెల్ ఫోన్.. 14 ఏళ్ళ బాలిక మృతి

M HANUMATH PRASAD

రాష్ట్రపతికి సుప్రీం కోర్టు డెడ్‌లైన్‌ పెట్టొచ్చా.. ద్రౌపది ముర్ము సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

పాక్‌ సైన్యానికి సపోర్ట్‌గా సోషల్‌ మీడియా పోస్టులు.. గవర్నమెంట్ టీచర్‌పై సస్పెన్షన్‌ వేటు..!

M HANUMATH PRASAD