Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

దుబాయ్, అబుదాబిని విడిచి వెళ్ళిపోండి.. ఇరాన్ హెచ్చరిక! ప్రపంచ దేశాల్లో ఆందోళన

ఐజ్రాయేల్అ మరియి అ మెరికా దాడుల నేపథ్యంలో బహ్రెయిన్, ఖతార్‌లపై దాడులు చేసిన ఇరాన్.. ఇప్పుడు దుబాయ్, అబుదాబిని విడిచి వెళ్ళిపోవాలని ప్రజలను హెచ్చరించడం ప్రపంచ దేశాల మధ్య ఉత్కంఠను పెంచింది.

అణు ఆయుధాల తయారీకి సంబంధించిన ఒప్పందానికి అంగీకరించాలని అమెరికా ఇరాన్‌పై ఒత్తిడి తెస్తోంది. ఇరాన్ తన అణుశక్తి మరియు క్షిపణి ప్రాజెక్టులను విరమించుకోవాలని కోరుతూ గత జూన్ నెలలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. 12 రోజుల పాటు సాగిన ఈ దాడుల్లో ఇరు దేశాలు పరస్పరం వైమానిక దాడులకు దిగాయి. ప్రస్తుతం టెహ్రాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తున్నాయి.

ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయం సమీపంలో కూడా దాడులు జరిగాయి. దీనితో ఆయన టెహ్రాన్ నుండి సురక్షిత ప్రాంతానికి వెళ్ళినట్లు సమాచారం. ఇరాన్ అధ్యక్ష భవనంతో సహా తూర్పు మరియు పశ్చిమ టెహ్రాన్‌లో దాడులు జరిగాయి. ఈ దాడుల తర్వాత ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. తమ దేశంపై ముప్పును అరికట్టేందుకే ఈ ముందస్తు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. ఇరాన్ పై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇరాన్ మళ్ళీ అణు ఆయుధాల తయారీని వేగవంతం చేసినందున, ఆ ముప్పును తప్పించేందుకే దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.

మరోవైపు ఇజ్రాయెల్-అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడులు చేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని సూచించారు. అదేవిధంగా అమెరికా నౌకాదళ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. బహ్రెయిన్ మరియు ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ నిరంతరం క్షిపణులను విసురుతోంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పై ఇరాన్ చేసిన దాడిలో ఒకరు మరణించారు. దుబాయ్ మరియు అబుదాబిలో శక్తివంతమైన బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. దుబాయ్ మరియు అబుదాబి ప్రజలు నగరాన్ని విడిచి వెళ్ళాలని ఇరాన్ హెచ్చరించడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. దుబాయ్, ఖతార్, అబుదాబి, బహ్రెయిన్ వంటి దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి.

Related posts

పాపం.. ధురంధర్ 2 దెబ్బకి వణికిపోతున్న పాక్ లీడర్

M HANUMATH PRASAD

14 మంది పాక్ సైనికులు హతం…వీడియో రిలీజ్ చేసిన బలూచ్

M HANUMATH PRASAD

‘మా నీరు మాకు కావాల్సిందే’.. సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్‌ ఆర్మీ చీఫ్‌

M HANUMATH PRASAD

37 వేల మంది పౌరసత్వం రద్దు–కువైట్‌ ప్రభుత్వం నిర్ణయం

M HANUMATH PRASAD

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు అంతర్జాతీయంగా ఘోర అవమానం..

M HANUMATH PRASAD

ఎంతకు తెగించాడు. అమ్మాయితో అశ్లీలంగా పాక్ హైకమిషనర్

M HANUMATH PRASAD