Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

కవిత పార్టీపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సెటైర్లు

కవిత కొత్త టీఆర్ఎస్ పార్టీపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సెటైర్లు సంధించారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
తెలంగాణలో “నిన్నటి దాకా పిట్టల దొరని చూశారు అని..ఇకపై పిట్టల దొరసానిని చూస్తారు అని అర్వింద్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేసీఆర్ కవితకు రోబోలా కనిపిస్తున్నారని, అంటే రజనీకాంత్ రోబో లెక్కనా అని ప్రశ్నించారు. వాళ్ల అయ్య కేసీఆర్ పదేళ్లు తెలంగాణను పాలించి ఏం చేశారో ముందు అడుగాలని సూచించారు. బీజేపీ ఎంపీలు బానిసలు అంటూ కవిత చేసిన విమర్శలపై అర్వింద్ స్పందిస్తూ…కవిత, వాళ్ల నాన్న కేసీఆర్ లెక్క మేము లిక్కర్ కు బానిసలం కాదు అని తిప్పికొట్టారు. మేము భారతమాతకు బానిసలం అని స్పష్టం చేశారు. కవిత రాజకీయ సమాధి కట్టింది బీజేపీనే అని అని,ఆమెకు ఇంకా టీఆర్ఎస్ హ్యాంగోవర్ పోయినట్లు లేదని విమర్శించారు. బీజేపీ సపోర్టు లేకుండానే తెలంగాణ వచ్చిందా? అని ప్రశ్నించారు.

అధికారం కోసం కల్వకుంట్ల కుటుంబం నుంచి మరో కొత్త పార్టీ వచ్చిందని..చివరకు ఉపనదులన్నీ సముద్రంలో కలుస్తాయి అని బీజేపీ శాసన సభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి తలో పార్టీ పెట్టారు అని, వాళ్ళు వదిలిన బాణమే కవిత అని పేర్కొన్నారు.

తెలంగాణ ఆస్తులు ఒకటొకటిగా అమ్మేస్తూ రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తుందని, భూదందాలు, ఆస్తుల అమ్మకాలు, అప్పులపైన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని ఏలేటి మహేందర్ రెడ్డి విమర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిస్సిగ్గుగా హిల్ట్ పాలసీతో లక్షల కోట్ల భూములను అమ్ముకుంటామని చెబుతున్నాడని ఆరోపించారు. అప్పలు చేస్తూ..ఆస్తులు, భూములు అమ్ముతూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. ఆర్టీసీ సమ్మెకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరినే కారణం అన్నారు. బీఆర్ఎస్ కాళేశ్వరం అక్రమాలపై ఇప్పటిదాకా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నమోదు చేయాలని, అనేక స్కామ్ లలో ఉన్న బీఆర్ఎస్ నాయకులను ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదన్నారు. గచ్చిబౌలిలోని 400ఎకరాల భూముల స్వాహాలో ప్రభుత్వం చేసిన డ్రామా అందరికి తెలిసిందేనన్నారు. బీఆర్ఎస్ నాయకులతో రహస్య ఒప్పందాలతోనే అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ పాలకులపై రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

Related posts

చౌటపల్లిలో ఖబరస్థాన్ ఆక్రమణ.. మనోభావాలు దెబ్బతిన్నాయని ముస్లింల నిరసన

M HANUMATH PRASAD

హైదరాబాద్ లో లైవ్ సెక్స్ దందా కు చెక్ పెట్టిన పోలీసులు

M HANUMATH PRASAD

లేఖ పై తొలిసారి స్పందించిన కవిత.. కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

మాలో ఎవరికి ఇచ్చిన పర్లేదు.. కేబినెట్ విస్తరణపై సీఎంకి మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేల రిక్వెస్ట్

M HANUMATH PRASAD

హైదరాబాద్‌లో పాక్ ఉగ్రవాదులు? వీడియో వైరల్

M HANUMATH PRASAD

బీహార్‌లోనూ రేవంత్‌ చిచ్చు

M HANUMATH PRASAD