Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

మోడీ నాయకత్వంలో దేశం సేఫ్‌గా లేదు.. CPI నేత రాజా కీలక వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) నేతృత్వంలో దేశం సేఫ్‌గా లేదని సీపీఐ(CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా(D.Raja) విమర్శించారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రదాడి నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మోడీ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పర్యాటకుల మృతిపై ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. పెహల్గాం(Pahalgam) ఘటనపై ప్రత్యేక పార్లమెంట్ సెషన్ నిర్వహించి..

సుదీర్ఘంగా చర్చించాలని డిమాండ్ చేశారు. చర్చ జరిగితే సభా వేదికగా మోడీని నిలదీస్తామని అన్నారు. భారత్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాలు అవసరం లేదని తెలిపారు. అసలు ఇండియా మీద ట్రంప్ పెత్తనం ఏంటని సీరియస్ అయ్యారు.

కాగా, భారత్‌- పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తమ ఘనతేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదే పదే పేర్కొనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఇప్పటికే అమెరికా నేత, పెంటగాన్‌ (Pentagon) మాజీ అధికారి మైఖేల్‌ రూబిన్ (Michael Rubin) స్పందించి ట్రంప్‌పై విమర్శలు చేశారు. అమెరికన్లలాగే భారతీయులు కూడా ట్రంప్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇంటర్నెట్ కనిపెట్టడం నుంచి క్యాన్సర్‌ను నయం చేసేవరకు అన్నింటికీ క్రెడిట్‌ తీసుకోవడం ట్రంప్‌నకు అలవాటేనని రూబిన్‌ ఎద్దేవా చేశారు.

Related posts

వామ్మో… చెన్నైలో రోడ్డుపై భారీ గుంత.. షాక్ అవ్వాల్సిందే

M HANUMATH PRASAD

పాక్‌ డ్రోన్లు కూల్చడానికి రూ.15 లక్షల విలువైన క్షిపణులా?: కాంగ్రెస్ నేత

M HANUMATH PRASAD

సీజేఐ కుమారుడికి.. కార్మికుడి కొడుక్కి ఒకే నిబంధనలా?

M HANUMATH PRASAD

ఆర్జీకర్ అత్యాచార బాధితురాలి తల్లికి బీజేపీ ఎమ్మెల్యే టికెట్.. టీఎంసీ విమర్శలు

M HANUMATH PRASAD

మమతా బెనర్జీ ”ముస్లిం ఓట్ బ్యాంక్” ఖతం.. ఓవైసీతో పొత్తు పెట్టుకుంటాం..

M HANUMATH PRASAD

సీఈసీ, ఈసీలకు జీవితకాల రక్షణ పై సుప్రీంకోర్టు సీరియస్.. కేంద్రానికి నోటీసులు

M HANUMATH PRASAD