*అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం…..
తాడేపల్లిగూడెం,ఆగస్టు 2:
ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి సర్కారు నిలబెట్టుకుంది. అన్నదాతా సుఖీభవ నిధి కింద ప్రతి రైతు ఖాతాలో తొలి విడతగా రూ.7 వేలు జమ చేసింది. కేంద్ర వాటా కింద రూ.2 వేలు, రాష్ట్రం వాటా కింద రూ.5 వేలు కలిపి రాష్ట్రంలోని 46,85,838 మంది రైతుల ఖాతాలో వేసింది. ఒక్కో ఏడాది రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు లబ్ధి చేకూరిందని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శనివారం వెంకట రామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో ఆయన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం ఇంచార్జ్ ఈతకోట తాతాజీ మరియు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వలవల బాబ్జి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ
రైతు సంక్షేమమే ధ్యేయంగా పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు రాష్ట్ర ప్రజలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులను పేదలను ఆదుకునేందుకు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారని అటువంటి వారిపై వైసీపీ ప్రభుత్వం గతం మరిచి ప్రజల వద్దకు రావడం వారి అవివేకమని అన్నారు.మరో జన్మ లో ఎత్తిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేరని ఘాటుగా విమర్శించారు. ఇసుక కుంభకోణం లిక్కర్ స్కాం వంటి అనేక దోపిడీలతో కోట్ల రూపాయల ధనాన్ని పెట్టెలో దాచుకున్న వైసిపి నాయకులు రాష్ట్రాన్ని ఆర్థిక మాన్యంలో త్రోసారని అన్నారు. దోచుకున్న ధనాన్ని ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో వైసిపి నాయకులు ఒకవైపు మరోవైపు ప్రజలు ఆకలి బాధలు అనుభవిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో
వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మరియు మండల అధికారులు, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ గోపాల్, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీమతి కె. కౌసర్ భానో, తాడేపల్లిగూడెం మరియు పెంటపాడు మండల రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారు లతోపాటు
తాడేపల్లిగూడెం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీ వర్తనపల్లి కాశి, పెంటపాడు మండల అధ్యక్షులు శ్రీ పుల్ల బాబి, శ్రీ రామ్ లక్ష్మణ్ బ్రదర్స్, టైలర్స్ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఆకాశపు స్వామి, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీ పరిమి కుమార్, శ్రీ పాలూరి వెంకటేశ్వరరావు, శ్రీ అడబాల నారాయణమూర్తి, శ్రీ చేపల రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శ్రీమతి ముద్దాల లక్ష్మీ ప్రసన్న, శ్రీ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, శ్రీ కామిశెట్టి శ్రీనివాస్, శ్రీ కాజులూరు మల్లేశ్వరరావు, శ్రీ నీలపాల దినేష్, శ్రీ బేతిన సాయి గిరిధర్, శ్రీ రాంప్రసాద్ చౌదరి, శ్రీ పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, శ్రీ నలగంచు రాంబాబు, శ్రీ సందాక రమణ, శ్రీ దారపురెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున హాజరైనారు.
