Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

వాహనాలు నడిపేవారు రహదారి భద్రత నియమాలు పాటించాలి… ఆర్టీవో సురేందర్ సింగ్ నాయక్.

వాహనాలు నడిపేవారు ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి సురేందర్ సింగ్ నాయక్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రవాణా శాఖ కార్యాలయం లో 37వ జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు కు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సురేందర్ సింగ్ నాయక్ మాట్లాడుతూ లైసెన్సులు లేకుండా వాహనాలు నడపరాదని, వాహనాలకు నిత్యం ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ లు రెన్యువల్ చేయించుకోవాలని తెలిపారు, ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆటో డ్రైవర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

జోగి ,అంబటి పై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తున్నాం….చిటికెన ప్రసాద్

Arnews Telugu

జగన్ మనసులో కొట్టు స్థానం పదిలం.

Arnews Telugu

బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జన సేన తీర్థం పుచ్చుకున్నా వైసిపి నేత తెన్నేటి జగ్జీవన్

Arnews Telugu

యువత పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి – బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu

సేవా నారీ..మహిళా విభాగం లోగోను ఆవిష్కరించిన హోం మంత్రి అనిత

Arnews Telugu

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6

Arnews Telugu