Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
గణపవరంపశ్చిమగోదావరి జిల్లా

జలధార–జలహారతి కార్యక్రమంపై గణపవరం బాలుర హై స్కూల్‌లో అవగాహన కార్యక్రమం

స్వచ్ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జలధార–జలహారతి” థీమ్‌పై గణపవరం బాలుర హై స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు వర్షపు నీటిని నిల్వ చేసే విధానం, నీటి కాలుష్యాన్ని నివారించే చర్యలు, భూగర్భ జలాల పరిరక్షణ మరియు పెంపొందనపై వివరంగా తెలియజేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గణపవరం ఎంపీడీవో మరియు పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ పి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు నీటి వనరులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
బాలుర హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వీరవేణి విద్యార్థుల్లో నీటి పరిరక్షణపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీ డి. శివరామ ప్రసాద్, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నీటి సంరక్షణపై చైతన్యం పెరిగింది.

Related posts

చలాన్ల వసూలు కోసం తాళం లాక్కోవద్దు

Arnews Telugu

“ఇంటర్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల సత్తా… తాడేపల్లిగూడెంలో మెరుగైన ఫలితాలు”

Arnews Telugu

తెలుగు రాష్ట్రాలో పంజా విసురుతున్న చలి పులి

Arnews Telugu

“మతం ఏదైనా – మనసు మంచిదై ఉండాలి” : కల్వరి టెంపుల్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu

స్వర్గీయ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహ ఆవిష్కరణ

Arnews Telugu

రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు అలంపురంలో

Arnews Telugu