Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
గణపవరంతాడేపల్లిగూడెం

“ఇంటర్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల సత్తా… తాడేపల్లిగూడెంలో మెరుగైన ఫలితాలు”

తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 15:
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల రీజనల్ ఇన్‌చార్జ్ బండారు సురేష్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.
నారాయణ విద్యాసంస్థలు డిస్ట్రిక్టివ్ మరియు కాంపిటేటివ్ విధానాల్లో విద్య బోధన అందిస్తున్నాయని తెలిపారు. ఈ రెండు విభాగాలపై సమానంగా దృష్టి పెట్టడం వల్లే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలిగారని పేర్కొన్నారు.
తాజాగా విడుదలైన ఫలితాల్లో జూనియర్ ఎంపీసీ విభాగంలో షణ్ముఖ 470 మార్కులకు గాను 461 మార్కులు సాధించగా, బైపీసీలో సాహిని 455 మార్కులకు గాను 449 మార్కులు సాధించింది. అలాగే సీనియర్ ఎంపీసీలో అమూల్య 984 మార్కులు సాధించి ప్రతిభ చాటింది.
ఈ ఫలితాల్లో బాలికలు ప్రత్యేకంగా రాణించారని తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నాగబాబు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులను అభినందించారు.

Related posts

దాళ్వా వరి పంటలో అధిక దిగుబడులు – కోతలు ముమ్మరం

Arnews Telugu

జనసేన సిద్ధాంతాలపట్ల నిబద్ధత ముఖ్యం..ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu

Dr హార్టికల్చర్ యూనివర్సిటీ లో పిజి, పిహెచ్డీ కోర్సులకు ప్రవేశలు

Arnews Telugu

“మతం ఏదైనా – మనసు మంచిదై ఉండాలి” : కల్వరి టెంపుల్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu

పార్టీలకు అతీతంగా జనసేన కుటుంబంలో స్థానం – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu

భీమవరం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు – ఉత్తమ ఉద్యోగిగా డి.ఎస్.ఆర్ ప్రసాద్‌కు అవార్డు

Arnews Telugu