Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
గణపవరంపశ్చిమగోదావరి జిల్లా

విద్యార్థుల్లో అంబేద్కర్ స్పూర్తి నింపిన జయంతి వేడుకలు

గణపవరం, ఏప్రిల్ 14:
స్థానిక శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల NSS యూనిట్ 1 & 2 ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. నిర్మల కుమారి అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, ఆయన సేవలను స్మరించారు. “బోధించు – సమీకరించు – పోరాడు” అనే అంబేద్కర్ ఆశయాలను విద్యార్థులకు వివరించారు.
తదుపరి గణపవరం కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి, వృద్ధులు, పిల్లలు, పేదలకు ఫలాలు, బిస్కెట్లు, మాంగో ఫ్రూటీస్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల IQAC కోఆర్డినేటర్ శ్రీ కె.వి. గణేష్ కుమార్, అధ్యాపకులు, NSS అధికారులు డాక్టర్ జి. వెంకటరమణ, శ్రీ ఎన్.వి.ఎన్.బి. శ్రీనివాసరావు, డాక్టర్ సిహెచ్ చైతన్య, సిహెచ్ రాజబాబు, పి.వి. రమేష్ బాబు, ఎస్. వెంకన్న బాబు, జై కేసీ ప్రసాదు, దేవ లక్ష్మీ కుమారి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

పశ్చిమగోదావరి జిల్లాలో పంటలపై వరద ముంపు ప్రభావం

Arnews Telugu

తాడేపల్లిగూడెం పంచాయతీరాజ్ కమిషనర్ ఆకస్మిక పర్యటన

Arnews Telugu

“మతం ఏదైనా – మనసు మంచిదై ఉండాలి” : కల్వరి టెంపుల్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu

ఘనంగా కందుకూరి వీరేశలింగం జయంతి

Arnews Telugu

తేనెటీగల పెంపకం పై ఉచిత శిక్షణ

Arnews Telugu

తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పట్టించుకోవడం లేదు – దండగర్ర సర్పంచ్ పిల్లా రాంబాబు ఆవేదన

Arnews Telugu