Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

యువత పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి – బొలిశెట్టి శ్రీనివాస్

యువత పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి – బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం, ఆగస్టు 2:
యువత పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి, స్వయం సమృద్ధి తోపాటు మరికొందరికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.

తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురంలో నూతనంగా నిర్మించిన “అపర్ణ ఎంటర్ప్రైజెస్ వాటర్ ప్లాంట్” ను ఆదివారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ ఉలవల బాబ్జి మాట్లాడుతూ యువత పారిశ్రామిక రంగంలో ప్రగతిపథం వైపు అడుగులు వేయాలని సూచించారు.

నాణ్యమైన మంచినీరు అందరికీ అందించే దిశగా ఈ ప్లాంట్ సేవలు అందించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి సూచించారు. అలాగే, ప్లాంట్ నిర్వాహకుడు కాకర్ల కిట్టును అభినందించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, ఆరుగొలను సొసైటీ మాజీ చైర్మన్ రెడ్డి రాము, మాజీ ఎంపీపీ కాకర్ల రమాదేవి ప్రభాకర్, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Related posts

“ఇంటర్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల సత్తా… తాడేపల్లిగూడెంలో మెరుగైన ఫలితాలు”

Arnews Telugu

నిట్ తాడేపల్లిగూడెంలో మీడియా నిషేధం – రాజ్యసభ సభ్యుడి ఆగ్రహం, పరిపాలనపై ప్రశ్నలు

Arnews Telugu

జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా గణపవరం డిప్యూటీ ఎంపీడీఓకు ఉత్తమ పురస్కారం

Arnews Telugu

హోటల్ నిర్వాహకులు చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : ఆహార భద్రతాధికారి వెంకటరత్నం

Arnews Telugu

చేలో ముత్యాలమ్మ 18వ వార్షికోత్సవం – భక్తులతో నిండిన ఆలయ ప్రాంగణం

Arnews Telugu

జనసేనలోకి వైసీపీ నుండి భారీ చేరికలు

Arnews Telugu