Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తణుకుపశ్చిమగోదావరి జిల్లా

గ్రావెల్ అక్రమ రవాణాపై విజిలెన్సు కొరడా – భారీ జరిమానాలు విధింపు

గ్రావెల్ అక్రమ రవాణాపై విజిలెన్సు కొరడా – భారీ జరిమానాలు విధింపు
తాడేపల్లిగూడెం | జనవరి 28, 2026:
గ్రావెల్ అక్రమ రవాణాపై విజిలెన్సు అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. అక్రమంగా గ్రావెల్ రవాణా జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ SP K. నాగేశ్వర రావు ఆదేశాలపై తాడేపల్లిగూడెం మరియు తణుకు పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో విజిలెన్సు, మైన్స్ మరియు రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు. ఆరుగొలను గ్రామం నుంచి అక్రమంగా గ్రావెల్ రవాణా జరుగుతున్నట్లు గుర్తించి మూడు యూనిట్ల గ్రావెల్ లారీ ఒకటి, ఆరు యూనిట్ల గ్రావెల్ లారీలు ఐదును తనిఖీ చేశారు.
తనిఖీల్లో సంబంధిత లారీలకు మైనింగ్ అనుమతులు, బిల్లులు లేకపోవడం, అలాగే అధిక లోడుతో గ్రావెల్ రవాణా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మైనింగ్ అపరాధ రుసుముగా రూ.66,000లు, అధిక లోడుకు సంబంధించి అపరాధ రుసుముగా రూ.2,56,000లు విధించారు.
ఈ సందర్భంగా అక్రమంగా గ్రావెల్ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ SP K. నాగేశ్వర రావు హెచ్చరించారు. అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ఈ సంయుక్త తనిఖీల్లో విజిలెన్సు AG P. శ్రీధర్, విజిలెన్సు ఇన్స్పెక్టర్ D. ప్రసాద్ కుమార్, విజిలెన్సు SI Ch. రంజిత్ కుమార్, విజిలెన్సు SI K. సీతారాము, మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ P. అన్నపూర్ణ, రవాణా శాఖ అధికారి K.V. సత్యనారాయణ పాల్గొన్నారు.

Related posts

గణపవరం మండలం కోమర్రులో విషాదం – ట్రాక్టర్ ప్రమాదంలో రైతు మృతి

Arnews Telugu

ముదునూరు సొసైటీ అధ్యక్షునిగా దాసరి అప్పన్న ప్రమాణ స్వీకారం

Arnews Telugu

మహిళలు అక్రమ రవాణాను నిరోదించడం అందరి భాద్యత… ఎంపిడిఓ

Arnews Telugu

ఘనంగా కందుకూరి వీరేశలింగం జయంతి

Arnews Telugu

వెలగపల్లి గ్రామాన్ని ప్రపంచ పటంలో చూడాలి… స్టిక్ బుక్ సీఈఓ అనిల్ కుమార్ 

Arnews Telugu

తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి

Arnews Telugu