Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి

తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి

సెప్టెంబర్ 1: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్‌ను జిల్లా కలెక్టర్ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాపారులతో మాట్లాడిన ఆమె, రైతుల నుండి సాధ్యమైనంత మంచి ధరకు ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని సూచించారు. రైతులను ఆదుకోవడం వ్యాపారుల కనీస బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు.

తరువాత మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ నాగరాణి, కర్నూలు–నంద్యాల జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా ఉల్లిపాయ పంట తీవ్రంగా దెబ్బతిందని తెలిపారు. ప్రజలు ఆరుదల ఉల్లిపాయలను వినియోగించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. నిల్వ చేయలేని ఉల్లిపాయలను వినియోగించడం ద్వారా అక్కడి రైతాంగానికి మద్దతు ఇవ్వవచ్చని ఆమె పిలుపునిచ్చారు.

ఉల్లి రైతుల పరిస్థితిని చక్కదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు.

అనంతరం సవిత్రపేటలో పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్ వెంట ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, తహశీల్దార్ ఎం. సునీల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు తదితరులు ఉన్నారు.

Related posts

“ఇంటర్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల సత్తా… తాడేపల్లిగూడెంలో మెరుగైన ఫలితాలు”

Arnews Telugu

ఆకివీడులో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తొలి వార్షికోత్సవం

Arnews Telugu

ఏలూరులో  శ్రీ గంగానమ్మను దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత

Arnews Telugu

కాశ్మీర్ అందాలను తలపించే రహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్

Arnews Telugu

కూతురు కాపురాని చక్కదిద్దేందుకు వెళ్లి… గోదావరి లో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ.

Arnews Telugu

గణపవరం మండలం కోమర్రులో విషాదం – ట్రాక్టర్ ప్రమాదంలో రైతు మృతి

Arnews Telugu