భవిత కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు
తాడేపల్లిగూడెం, ఆగస్టు 22:
స్థానిక భవిత కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం హై స్కూల్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కోడూరి నాగబాబు, దివ్యాంగుల పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం పిల్లలకు బిర్యానీ, కేక్, స్నాక్స్ వడ్డించారు.
చిరంజీవి సేవలు మరువలేనివి – నాగబాబు
కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ, “మెగాస్టార్ చిరంజీవి మహోన్నత వ్యక్తి. ఆయన స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక పేదలకు రక్తదానం, నేత్రదానం జరిగి వేలాది ప్రాణాలు రక్షించబడ్డాయి. ఇలాంటి సేవా తపన కలిగిన మహానుభావుడు చిరంజీవి” అని కొనియాడారు. చిరంజీవి 70వ జన్మదినానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
వేడుకలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో వన్నెం రెడ్డి అనిల్, చిరంజీవి అభిమాని సుంకర గంగాధర్, భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్.కే. బాల ఈశ్వరయ్య, ఎం. చంద్ర కుమారి, నాగలక్ష్మి, దివ్యాంగుల పిల్లలు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
