Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఉర్రూతలూగించే విధంగా ప్రెషర్స్ డే కార్యక్రమం

శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఉర్రూతలూగించే విధంగా ప్రెషర్స్ డే కార్యక్రమం

యువత చదువుతోపాటు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 13:
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్‌లో గల శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే ఘనంగా జరిగింది.

కళాశాల ప్రిన్సిపల్ మద్దాల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకకు కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్, పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ – వాసవి విద్యాసంస్థలలో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, తల్లిదండ్రుల కలలను నిజం చేస్తూ ఉన్నత అవకాశాలను సాధించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జూనియర్స్‌కు సీనియర్స్ ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ మండ బ్రహ్మాజీ, ట్రెజరర్ నున్న సుందరం, వైస్ ప్రెసిడెంట్ పెనుగొండ వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

తాడేపల్లిగూడెం: 64 ఏళ్ల చరిత్ర గల ఆఫీసర్స్ క్లబ్ కూల్చివేత

Arnews Telugu

పెళ్లి ప్రయాణీకుల బస్సు బోల్తా.. ఐదుగురు మృతి, 85 మందికి గాయాలు..!!

Arnews Telugu

వీధుల్లో ఒక్క కుక్క ఉండకూడదు – వెంటనే షెల్టర్లకు తరలించండి: సుప్రీంకోర్టు కీలక ఆదేశం

Arnews Telugu

ఆత్రేయపురంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు రికార్డు లేని 20 వాహనాలు స్వాధీనం – 20 లీటర్ల సారాతో మహిళ అరెస్ట్

Arnews Telugu

తాడేపల్లిగూడెం వైఎస్సార్సీపీకి ఝలక్ ఇచ్చిన సీనియర్ నేత

Arnews Telugu

ప్రజా సమస్యల పరిష్కారమే నా ఎజెండా… దర్శిపర్రు ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu