ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం 2 లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “సూపర్ సిక్స్” హామీల్లో భాగంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం క్రింద తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన ఆటో రిక్షా, మాక్సీ క్యాబ్ మరియు మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించారు.
శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 1 కోటి 89 లక్షల 75 వేల రూపాయల నిధులను 1265 మంది డ్రైవర్లకు ప్రభుత్వం విడుదల చేసింది.
కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, సభలో మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం తాను 2 లక్షల రూపాయలు స్వంత నిధులతో విరాళంగా ఇస్తానని సభలో హామీ ఇచ్చి, ఆదివారం సాయంత్రం 4 గంటలకు తన కార్యాలయంలో డ్రైవర్ యూనియన్ ప్రతినిధులకు ఆ మొత్తాన్ని అందజేశారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్ రోజుకు రెండు రూపాయల చందా యూనియన్‌కి చెల్లించి, ఆ నిధులను కష్టకాలంలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, మద్దాల మణికుమార్, మైలవరపు రాజేంద్రప్రసాద్, కొనకళ్ళ హరినాథ్, పైబొయిన రఘు, సుబ్బరాజు, కాంట్రాక్టర్ శివ, నరిసే సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
👉 ఆటో డ్రైవర్ల సంక్షేమం పట్ల ఎమ్మెల్యే చూపిన స్పందన ప్రాంత ప్రజల్లో మంచి చర్చకు దారి తీసింది.
