తాడేపల్లిగూడెం డిసెంబర్ 6:
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు శనివారం పట్టణంలోని వాకర్స్ అసోసియేషన్ గ్రౌండ్ లో నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జరుగు నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడల పోటీలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ పోటీలకు పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 11 బ్రాంచ్ లు వారు ఈ క్రీడా పోటీలలో పాల్గొన్నారు సబ్ జూనియర్ జూనియర్, సినియర్ లెవల్స్ రన్నింగ్ రేస్, డార్జి బాల్, చెస్, లీలే రెస్, కాకో, కబ్బడ్డ, వంటి గేమ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని, ఒత్తిడి నుండి ఉపశమనాన్ని ఇస్తాయని ఇలాంటి టోర్నమెంట్ లు విద్యార్థులలో టీం స్పిరిట్ నాయకత్వ లక్షణాలను పెంచుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు బిజెపి నాయకులు నరిసే సోమేశ్వర రావు, జనసేన నాయకులు చాపల రమేష్ కూటమి నాయకులు నారాయణ విద్యాసంస్థల డీజీఎం రామిరెడ్డి గూడెం స్కూల్ ప్రిన్సిపల్ ఎన్ఫీ మిగతా బ్రాంచ్ ల పిన్సిపల్స్, ఆర్ ఐ లు, పీఈటీలు, కోఆర్టినేటర్లు ఉపాధ్యాయలు ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
