వెలగపల్లి గ్రామాన్ని ప్రపంచ పటంలో చూడాలనేదే తన ద్వేయం అని స్టిక్ బుక్ సీఈవో అనిల్ కుమార్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం పెంటపాడు డిఆర్ గోయింకా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో మంగళవారం స్టిక్ బుక్ పరిచయ వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు, చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్టిక్ సీఈవో అనిల్ కుమార్ ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. పలువురు వక్తలు మాట్లాడుతూ తాను ఎదగడమే కాకుండా పదిమంది ఎదగడానికి చేయూతనిస్తున్న అనిల్ కుమార్ కి అభినందనలు తెలిపారు. సొంత సోలాభం కోసం కన్న తల్లి లాంటి దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో, స్టిక్ బుక్ ద్వారా తన మాతృభూమికి ఎంతో కొంత సేవ చేయాలని దృఢ సంకల్పంతో దేశానికి తిరిగి వచ్చే సేవ చేస్తున్న అనిల్ కుమార్ ను పలువురు ఆదర్శంగా తీసుకొని దేశానికి సేవ చేయాలని అన్నారు.స్టిక్ బుక్ సీఈఓ మాట్లాడుతూ ఇప్పటికే ఏడు దేశాలలో తమ సంస్థ ద్వారా సేవలందిస్తున్నానని, మరో 17 దేశాలలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు, కేవలం చదువులోనే గాక స్కిల్స్ ఉన్న విద్యార్థులకు తమ సంస్థ ద్వారా అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం నాకు చదువు చెప్పిన గురువులు వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. కొన్ని లక్షల రూపాయలు వెచ్చించే పుట్టిన ప్రాంతానికి సేవలందించడం ద్వారా అనిల్ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని డీఈవో నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివై ఈవో రామాంజనేయులు, మానవతా ప్రతినిధి మోహన్ రావు, ఎస్టియు రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్, ఎంఈఓ లు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
previous post
