గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.పట్టణం నడిబొడ్డున గల నెహ్రూ చౌక్ సెంటర్లోనీ వాణిజ్య దుకాణాల సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువైన దుకాణాల్లోని వస్త్రాలు, విలువైన యంత్ర సామాగ్రి కాళీ బూడిదయ్యాయి. విషయం తెలుసుకొని ఘటన స్థానం చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది గంట నుండి ప్రయత్నిస్తున్న మంటలను అదుపు చేయలేకపోతున్నారు. ఉయ్యూరు, హనుమాన్ జంక్షన్, పరిసర ప్రాంతాల నుండి అగ్నిమాపక శకటాలను తెప్పించి మరి మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన కాంప్లెక్స్ లోనే ఓ జూనియర్ కళాశాల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెహ్రూ చౌక్ కార్యాలయాలు కూడా ఉండడం విశేషం. భారీగా మంటలు పొగ అలుముకోవడంతో, సమీప ప్రాంతాల్లోని నివాసితులు భయాందోళనతో రోడ్లపైకు వచ్చారు. ఓ సెల్ ఫోన్ షాపులో ముందుగా మంటలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
