ఒరిస్సా భువనేశ్వర్ లో ఒక విద్యార్థి స్కూల్‌కు రివాల్వర్ తెచ్చాడు. తనను తిట్టిన ప్రధానోపాధ్యాయుడ్ని ఆ గన్‌తో బెదిరించాడు. ఎరా ? నేను ఇక్కడ చదువుకొన్నంత కాలం నన్ను బెదిరించకూడదు.. క్లాస్ లో నన్ను తిట్టకూడదు.. నాకు ఎక్కువ మార్కులు వేయాలి లేదంటే.. ఇందులోని బులెట్ నీ తలలోకి గుండెల్లోకి పంపిస్తాను ? అని స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చాడు.ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొరువాలోని ప్రభుత్వ హైస్కూల్‌లో 14 ఏళ్ల బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం దేశీయ రివాల్వర్‌ను స్కూల్‌కు తీసుకువచ్చాడు. క్లాస్‌రూమ్‌లో తనను తిట్టిన ప్రధానోపాధ్యాయుడు, టీచర్లను ఆ గన్‌తో బెదిరించాడు. ఈ సంఘటనతో వారు షాక్ అయ్యారు.కాగా, హెడ్‌మాస్టార్ దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ స్కూల్‌కు చేరుకున్నారు. మైనర్ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దేశీయ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలుడ్ని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పర్చిన తర్వాత స్పెషల్ హోమ్‌కు తరలించారు. ఆ తుపాకీ బాలుడికి ఎలా వచ్చింది అన్నదానిపై అతడి తల్లిదండ్రులు, బంధువులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
next post
