జనసేనల పట్ల నిబద్ధత ఉన్నవారే పార్టీలో పని చేయాలని, తాత్కాలిక ప్రయోజనాలను ఆశించవద్దని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెం గ్రామానికి చెందిన బహుజన పేట అంబేద్కర్ యూత్ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 60 మంది జనసేన నాయకుడు పైబోయిన వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మిస్తున్నామని, అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
