తాడేపల్లిగూడెం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ సమీపంలో గల సిడబ్ల్యూసి గొడౌన్ ఎదురుగా ఏర్పాటుచేసిన రహమాన్ ట్రేడ్ పెయిర్ ఎగ్జిబిషన్ ను బుధవారం ప్రభుత్వ విప్,తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెం చరిత్రలో ఈ రహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ చూపారులను ఆకట్టుకుంటుందని అన్నారు.క్రిస్మస్, నూతన సంవత్సరం,సంక్రాంతి వంటి పండుగ దినాలలో కుటుంబ సభ్యులు వారి చిన్నారులతో సహా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించి గడపవచ్చని ఆయన తెలిపారు.ఎగ్జిబిషన్లో ఏర్పాటుచేసిన పలు సెట్టింగులు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పారు.నిర్వాహకులు అబ్దుల్ మొహిద్దిన్ ఖాన్ మాట్లాడుతూ జెయింట్ వీల్,కొలంబస్, డ్రాగన్ ట్రైన్, టొరా టొరా, మరియు చిన్నపిల్లలను అలరించే, దెయ్యాలకోట,మహిళలకు అవసరమయ్యే అలంకార వస్తువులు ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు.ఈ ఎగ్జిబిషన్లోనికి ప్రవేశించగానే చూపరులను మైమరిపించే విధంగా ఆంధ్రప్రదేశ్ లోనే ఏ ఎగ్జిబిషన్లో లేని విధంగా,మొట్టమొదటిసారిగా కాశ్మీర్ అందాలను తలపించేలా సెట్టింగులను తీర్చిదిద్దారన్నారు.సాయంత్రం 5గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంలో చూపరులంత సందర్శించ వచ్చునని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లా బాబీ, సిపిఐ జిల్లా నాయకులు మండల నాగేశ్వరరావు,బాదంపూడి గ్రామ మాజీ సర్పంచ్ వంకెన కృష్ణారావు, చింతకాయల దొరబాబు, నర్సింగ్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.
