Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యం వైద్యంతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తున్న గౌతమి హాస్పిటల్ ను అభినందించాలి… ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు.

అతి తక్కువ ఖర్చుతో మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని తాడేపల్లిగూడెం ప్రజలకు అందిస్తున్న గౌతమి హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించాలని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మి పేటలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమి మల్టీ స్పెషాలిటీ సారధ్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు, పార్టీ నాయకులు పుట్టినరోజులు, పెళ్లిరోజులను పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. గొర్రెల శ్రీధర్ చేస్తున్న ప్రజా ఉపయోగ కార్యక్రమాలు అభినందించదగ్గ విషయమని కొనియాడారు. తాడేపల్లిగూడెంలో అత్యంత తక్కువ ఖర్చుతో ప్రజలకు మల్టీస్పెషలిటీ వైద్యాన్ని అందిస్తున్న గౌతమి హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌతమి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ మంగాబాయ్ రమేష్, గౌతమి హాస్పిటల్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఏపీ లో మహిళలకు నెలకు రూ 1500

Arnews Telugu

తాడేపల్లిగూడెం రేషన్ బియ్యం పట్టివేత

Arnews Telugu

ప్రభుత్వవైద్యంపై అసత్య ప్రచారం తగదు:ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu

ఇంట్లో చిరుతపులి సంసచారం

Arnews Telugu

పెళ్లి ప్రయాణీకుల బస్సు బోల్తా.. ఐదుగురు మృతి, 85 మందికి గాయాలు..!!

Arnews Telugu

ఘనంగా కార్మెల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 34 వ వార్షికోత్సవ వేడుకలు

Arnews Telugu