Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
అంతర్జాతీయంక్రైమ్ వార్తలుజాతీయ వార్తలుప్రత్యేక కథనం

అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తున్న స్టార్ లింక్ శాటిలైట్

అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తున్న స్టార్ లింక్ శాటిలైట్

  • శాటిలైట్ ప్రొపల్షన్ ట్యాంకు నుంచి గ్యాస్ లీక్
  • ఒక్కసారిగా 4 కిలోమీటర్ల కిందికి పడిపోయిన శాటిలైట్
  • మరో వారం రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశించే అవకాశం

ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ప్రాజెక్టు శాటిలైట్లలో ఒకటి అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తోంది. ఆ శాటిలైట్ లోని ప్రొపల్షన్ ట్యాంకులో ఉన్న గ్యాస్ తీవ్ర వేగంతో బయటికొచ్చేసిందని, దాంతో ఆ శాటిలైట్ ఒక్కసారిగా 4 కిలోమీటర్ల కిందికి వచ్చేసిందని స్పేస్ ఎక్స్ సంస్థ వెల్లడించింది.

డిసెంబరు 17 నాటికి భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఉపగ్రహం… మరో వారం రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశించి కూలిపోతుందని వివరించింది. అయితే, దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదని, అదే సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కూడా ఎలాంటి ముప్పు లేదని స్పేస్ ఎక్స్ స్పష్టం చేసింది. భూవాతావరణంలోకి ప్రవేశించగానే, ఆ శాటిలైట్ కాలిపోతుందని తెలిపింది.

కాగా, కూలిపోతున్న స్టార్ లింక్ శాటిలైట్ శకలాలను వరల్డ్ వ్యూ-3 అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసింది.

Related posts

కూతురు కాపురాని చక్కదిద్దేందుకు వెళ్లి… గోదావరి లో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ.

Arnews Telugu

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు టెర్రర్

Arnews Telugu

తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

Arnews Telugu

ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ అరెస్ట్

Arnews Telugu

గుడివాడ అద్దేపల్లి కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం…. కోట్లలో ఆస్తి నష్టం….

Arnews Telugu

తెలుగు రాష్ట్రాలో పంజా విసురుతున్న చలి పులి

Arnews Telugu