కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం భీమవరంలో అటల్ – మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొని, ఉండి బైపాస్ రోడ్డు కూడలిలో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రత్యేక ఛాపర్ లో పెద్దఅమీరంలో ఏర్పాటుచేసివున్న హెలిపాడ్ కు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు తో కలిసి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల జడ్పీ చైర్మన్ గంటా పద్మ శ్రీ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీo అస్మి, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, తాడేపల్లిగూడెం, నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ లు బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, బిజెపి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, టిడిపి నాయకుడు మెంటే పార్థసారథి, జిల్లా నాయకులు, స్థానిక నాయకులు, తదితరులు పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
previous post
