Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణప్రత్యేక కథనం

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6

అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన ఎల్వీఎం-3 ఎం-6 ఉపగ్రహన్ని తన బాహుబలి రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో.తిరుపతి, మీ24న్యూస్ డెస్క్: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రస్థానంలో మరో మైలురాయి చేరింది. నేటి(బుధవారం) ఉదయం 8:54 గంటలకు ఎల్వీఎం-3 ఎం-6 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది ఇస్రో(LVM-3 M-6). శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్(SHAR) నుంచి అమెరికా(America)కు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ను కక్ష్యలోకి పంపారు(Blue Bird Block-2). 6,400 కిలోల బరువుగల ఈ భారీ ఉపగ్రహాన్ని మోసుకెళ్లే క్రమంలో నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిసింది రాకెట్. వాణిజ్య ప్రయోగంతో తన బాహుబలి రాకెట్ ద్వారా ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిర్దేశిత కక్ష్యలో15.07 నిమిషాల్లో రాకెట్ మూడు దశలు పూర్తవగానే లో ఎర్త్ ఆర్బిట్(లియో)లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్(AST Space Mobile) సంస్థతో సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించింది ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(NSIL)ప్రయోగంతో తన బాహుబలి రాకెట్ ద్వారా ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పనుంది.

Related posts

పేదల ఆకలి తీర్చడం మహాభాగ్యం – దాతల సహకారం అమూల్యం కాశినాయన ఆశ్రమంలో నిరంతర అన్నదాన కార్యక్రమం

Arnews Telugu

తాడేపల్లిగూడెంలో ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ

Arnews Telugu

సైబర్ మోసానికి బలైన మాజీ ఐపీఎస్… తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య.

Arnews Telugu

ఇండోనేషియాలో ఘోర బస్సు ప్రమాదం…15 మంది దుర్మరణం

Arnews Telugu

శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం – కలెక్టర్ చదలవాడ నాగరాణి

Arnews Telugu

పార్టీలకు అతీతంగా జనసేన కుటుంబంలో స్థానం – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu