- శబరిమలలో ఘనంగా మండల పూజ…వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
- తిరిగి 30న తెరుచుకోనున్న ఆలయం…
శబరిమల: అయ్యప్పస్వామి కొలువైన శబరిమలలో శనివారం మండలపూజ ఘనంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మణికంఠుడు దర్శనం చేసుకున్నారు.ఆలయ తంత్రి కందరారు మహేశ్ మోహనారు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహిం చారు. రాత్రి పదిగంటల సమయంలో స్వామికి పవళింపు కీర్తన హరివరాసనం ఆలపించిన అనంతరం ఆలయ ద్వారాలను లాంఛనంగా మూసివేశారు.దీంతో వార్షిక యాత్ర సీజన్లో 41 రోజుల పాటు సాగిన తొలిదశ ముగిసినట్లైంది. మకరవిలక్కు పూజల కోసం ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు ఆయ్యప్ప ఆలయ ద్వారాలను తెరుస్తారు. ఆ రోజు నుంచి వార్షిక యాత్ర సీజన్లో రెండో దశ మొదలవుతుంది.
