నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలి
— జిల్లాస్థాయి కెరీర్ ఎగ్జిబిషన్ లో గురుకుల విద్యార్థులకు ప్రథమ బహుమతి
— రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
— విద్యార్థులను అభినందించిన డీఈఓ నారాయణ
తాడేపల్లిగూడెం
ప్రభుత్వం అందిస్తున్న విద్యా వనరులను సద్విని చేసుకుని విద్యార్థులు నూతన ఆవిష్కరణ వైపు అడుగులు వేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి వై. నారాయణ అన్నారు ఇటీవల ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి కెరీర్ గైడెన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శనలో పెద తాడేపల్లి లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలకు ప్రథమ బహుమతి లభించింది అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులు డీఈఓ నారాయణ ను ఆయన కార్యాలయంలో సోమవారం కలిసారు గురుకులం విద్యార్థులను ఆయన అభినందించారు ఈ సందర్భంగా డీఈవో వై. నారాయణ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వం అందిస్తున్న, సాంకేతిక పరిజ్ఞానాన్ని, విద్యా వనరులను సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి నూతన ఆవిష్కరణ వైపు అడుగులు వేయడంతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు విద్యార్థి స్థాయి నుంచి కెరీర్ గైడెన్స్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు ఎంచుకున్న రంగంలో విజయం సాధించేందుకు కృషి పట్టుదలతో ముందుకు సాగాలన్నారు ఉపాధ్యాయుల సహకారంతో ఇంజనీరింగ్, విద్య వైద్య, అంతరిక్షం, సాంకేతిక, రక్షణ రంగాల్లో జరుగుతున్న పరిశోధనలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు కెరీర్ ఎగ్జిబిషన్ లాంటి ప్రదర్శనల్లో విద్యార్థులు పాల్గొనడం ద్వారా వారిలో దాగి ఉన్న సృజనాత్మకత బయటపడుతుందన్నారు, సృజనాత్మకత ఆధారంగానే విద్యార్థుల కెరీర్ పై స్పష్టత వస్తుందన్నారు కెరీర్ ఎగ్జిబిషన్లో ప్రథమ సాధన సాధించిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం రావడం అభినందనీయం అన్నారు విజయానికి తోడ్పాటు అందించిన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రాజారావును ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి శ్యాంసుందర్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
