తాడేగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన ఉప్పు వెంకటరమణ అనే మహిళ జీవనోపాధి నిమిత్తం మలేషియా కి వెళ్ళింది, మహిళ పనిచేస్తున్న ఇంటిలో చిత్రహింసలు గురి చేస్తున్నారని ఇండియాకే వెళ్లిపోతానని తెలపడంతో, యజమాని పాస్పోర్ట్ తీసేసి నిర్బంధించి ఇండియాకు రానివ్వకుండా చిత్రహింసలకు గురి చేశారు, దింతో 18 ఏళ్లగా మలేషియాలోనే తినడానికి తిండి లేక ఉండడానికి గూడు లేక బిక్కుబిక్కుమంటూ గడప వలసిన పరిస్థితి వచ్చిందంటూ ఆమె తెలిపింది, తన కొడుకులకు కుటుంబ సభ్యులకు తెలిపిన ఇండియాకి రప్పించలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు వద్దకు తీసుకువెళ్లగా, మలేషియాలోనే ఉన్న జనసేన నాయకులు తో మాట్లాడి ఉప్పు వెంకటరమణను ఇండియాకి రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. అందుకు అయ్యే ఖర్చు కూడా తానే సొంతంగా ఇస్తానని వారికి తెలిపారు. ఇండియన్ అంబాసితో మాట్లాడి ఆ మహిళను ఇండియాకి రప్పించేలా చట్టపరమైన సమస్యలను క్లియర్ చేసి ఆమెను ఇండియకు పంపించారు. ఇండియా చేరుకున్న ఉప్పు వెంకటరమణ సోమవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు కలిసి ఇండియాకి రప్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మీ రుణం తీర్చుకోలేనని నా కుటుంబానికి దగ్గర చేర్చినందుకు మీకు రుణపడి ఉంటానని ఉప్పు వెంకటరమణ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వద్ద భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబంలో ఎలాంటి అవసరం ఉన్న తనను కలవచ్చని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు కుటుంబానికి భరోసా ఇచ్చారు.
