వాహనాలు నడిపేవారు ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి సురేందర్ సింగ్ నాయక్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రవాణా శాఖ కార్యాలయం లో 37వ జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు కు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సురేందర్ సింగ్ నాయక్ మాట్లాడుతూ లైసెన్సులు లేకుండా వాహనాలు నడపరాదని, వాహనాలకు నిత్యం ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ లు రెన్యువల్ చేయించుకోవాలని తెలిపారు, ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆటో డ్రైవర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
