Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంవిద్య

ఏపీ నిట్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

  • ఏపీ నిట్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
  • ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే విద్యాసంస్థ లక్ష్యం
  • ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి

తాడేపల్లిగూడెం… ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతోనే గురువులు విద్య నేర్పుతారని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. నేషనల్. ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంద్రప్రదేశ్ (ఏపీ నిట్)లో 2015-2019, 2016-2020 బ్యాచ్ ల్లో నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సును పూర్తిచేసుకున్న బీటెక్ పూర్వ విద్యార్థుల తొలి ఆత్మీయ సమ్మేళనాన్ని సంస్థ ప్రాంగణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ కెరీర్, అలుమ్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ జీబి వీరేష్ కుమార్ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా

జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పటికి మరిచిపోకూడదని తెలిపారు.

పూర్వ విద్యార్థులు, విద్యా సంస్థ మధ్య బలమైన అనుబంధానికి, పునాదికి ఇటువంటి ఆత్మీయ వేడుకలే నిదర్శనమని, భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తామని చెప్పారు. పూర్వ విద్యార్థులు పరిశోధన, విద్యా సంబంధమైన విషయాల్లో తమతో కలిసి పనిచేస్తూ విద్యాసంస్థ ప్రగతికి, పురోభివృద్ధికి దోహదపడాలని వివరించారు.

ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ కెరీర్, అలుమ్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ జీబి వీరేష్ కుమార్ మాట్లాడుతూ తమ పూర్వ విద్యార్థులను కలిసిననందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థులు వివిధ హోదాల్లో రాణించడంతో పాటు మరిన్ని విజయాలు సాధించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని వివరించారు. పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఏపీ నిట్ విద్యా సంస్థలో చదువుకోవటమే తమ జీవితాలకు కీలక మలుపు అని, ఇక్కడ పొందిన విద్య, క్రమశిక్షణ, విలువలే తమను వివిధ రంగాల్లో నిలబెట్టాయని చెప్పారు. తమ ఉన్నతకి ఎంతగానో దోహదపడిన విద్యాలయానికి తమ వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తామని ప్రకటించారు. అక్షర జ్ఞానాన్ని నేర్పించి, మంచి, చెడు చెప్పి, జీవితానికో దారి చూపించిన గురువులను సన్మానించుకునే అవకాశం దక్కటం తమ అదృష్టంగా భావిస్తున్నామని వివరించారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి అసోసియేట్ డీన్, ఆచార్యులు డాక్టర్ సుదర్శన్ ధ్రువ సహా సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆరేళ్ళ తరువాత విద్యా సంస్థలోకి అడుగుపెట్టిన మిత్రులందరూ ఒకరినొకరు ఎంతో ఆప్యాయతగా పలకరించుకున్నారు. ఒకరికొకరు తమ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల ఆత్మీయ సాన్నిహిత్యాన్ని నెమరవేసుకున్నారు. అప్పటి మధుర క్షణాలను, స్మృతులను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. పూర్వ విద్యార్థులు గురువులతో స్వీయచిత్రాలు తీసుకుని ఆయా మధురస్మృతులను తమ తమ చరవాణిలలో భద్రపరచుకోవటం విశేషం. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాయంత్రం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ జి.రవికిరణ్ శాస్త్రి, డాక్టర్ వి.సందీప్, డాక్టర్ ఎన్.జయరామ్, డాక్టర్ కార్తీక్ శేషాద్రి, డాక్టర్ హిమబిందు, పలువురు విభాగాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు.

Related posts

పార్టీలకు అతీతంగా జనసేన కుటుంబంలో స్థానం – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu

తాడేపల్లిగూడెంలో ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ

Arnews Telugu

నారా బ్రహ్మణికి ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు

Arnews Telugu

“తాడేపల్లిగూడెంలో ప్రాంతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చీరలు, స్వీట్లు పంపిణీ”

Arnews Telugu

బాల్యవివాహం వద్దు చదువే ముద్దు…. డిసిపిఓ సూర్య చక్రవేణి 

Arnews Telugu

తాడేపల్లిగూడెం వైసీపీ అధిష్టానం – కొట్టు సత్యనారాయణ భవిష్యత్తు ప్రశ్నార్థకం?

Arnews Telugu