ఏపీ లో మహిళలకు నెలకు రూ 1500 దాదాపు ఖరారు చేసింది. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగం తో సమావేశాలు ప్రారంభిస్తారు. ఆ వెంటనే బీఏసీ సమావేశం కానుంది. అందులో సమావేశ అజెండా.. పని దినాల పైన నిర్ణయం తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాలు కావటంతో 14వ తేదీ 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ సారి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ తో పాటుగా ఇరిగేషన్ కేటాయింపులతో మరో ప్రత్యేక బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. 18 నుంచి 21 పని దినాలు సమావేశాలు కొనసాగే విధంగా బడ్జెట్ సమావేశాల అజెండా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 28న జరిగే కేబినెట్ భేటీల అసెంబ్లీ సమావేశాల పైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ సారి బడ్జెట్ లో ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలోని 18 మరియు 59 సంవత్సరాల మధ్య వయస్సు గల అర్హులైన మహిళలందరికీ రూ. ప్రతి నెల 1,500 ఇచ్చేలా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
దీని ద్వారా మహిళలకు పూర్తిగా బాసటగా నిలుస్తున్న ప్రభుత్వం మరింతగా వారికి దగ్గరవ్వటంతో పాటుగా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది
