మార్కాపురం జనవరి 29:
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లాలోని కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో గురువారం అభినందన సభ జరిగింది.
ఈ కార్యక్రమాన్ని గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా
ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్‌గా,
ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ బాధ్యుడిగా,
సమాజ సేవలో విశేష సేవలు అందిస్తున్న బి.ఎస్. నారాయణరెడ్డికి
మేరా భారత్ మహాన్ పురస్కారం అందుకున్న సందర్భంగా ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ఉపవిద్యా శాఖ అధికారి ఎం. కాశి ఈశ్వరరావు హాజరై మాట్లాడుతూ
సమాజ సేవే సర్వేశ్వర సేవ అని పేర్కొన్నారు.
ప్రేమ, సేవ మానవుడికి రెండు రెక్కలని చెప్పారు.
నిస్వార్థంగా స్వచ్ఛంద సేవలు అందిస్తూ
అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం,
ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా తరగతులు నిర్వహించడం,
నిరుపేదలకు ఆశ్రయం కల్పించడం,
ప్రతి సోమవారం కాశి నాయన ఆశ్రమం వద్ద భోజనాల ఏర్పాటు చేయడం,
మిగులు భోజనాలను అవసరమైన వారికి అందించడం,
పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, నాటించడంలాంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ
బి.ఎస్. నారాయణరెడ్డి పదుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
అనంతరం పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయ సిబ్బంది
బి.ఎస్. నారాయణరెడ్డిని శాలువాతో సత్కరించి
జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో
మానవతా సేవా సంస్థ అధ్యక్షుడు సత్య నారాయణ రెడ్డి,
గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి ఫరూఖ్,
పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
