భారతీయ సాంస్కృతిక ఆస్తి యోగ
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అలంపురం సరస్వతి విద్యాలయంలో గురువారం రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, అధ్యక్షురాలు రాధిక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ –
“యోగ భారతీయ సాంస్కృతిక ఆస్తి. ఇది కేవలం శారీరక వ్యాయామమే కాకుండా, ఆధ్యాత్మికత, మానసిక ప్రశాంతత, ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుంది. యోగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ దాన్ని ఆచరించాలి” అని తెలిపారు.
ప్రారంభ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసు బాబు, వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి వ్యవస్థాపకులు కొలనువాడ పెదకృష్ణంరాజు, రాష్ట్ర యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు కరివండి రామకృష్ణ, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
