శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఉర్రూతలూగించే విధంగా ప్రెషర్స్ డే కార్యక్రమం
యువత చదువుతోపాటు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 13:
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే ఘనంగా జరిగింది.
కళాశాల ప్రిన్సిపల్ మద్దాల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకకు కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్, పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ – వాసవి విద్యాసంస్థలలో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, తల్లిదండ్రుల కలలను నిజం చేస్తూ ఉన్నత అవకాశాలను సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జూనియర్స్‌కు సీనియర్స్ ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ మండ బ్రహ్మాజీ, ట్రెజరర్ నున్న సుందరం, వైస్ ప్రెసిడెంట్ పెనుగొండ వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
