కొట్టు అవినీతి, అసత్య ఆరోపణలు తిప్పికొడుతున్నాం: జనసేన నేతలు
తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 13:
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ నిజాయితీగా పనిచేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలని జనసేన నాయకులు తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు.
శనివారం పట్టణంలోని జనసేన నాయకుడు ఉంగరాల శ్రీనివాస్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ—
“కొట్టు రెండు సార్లు గాలి ఆధారంగా గెలిచారు గాని, ప్రజా బలం లేదా స్వీయ చరిష్మాతో ఎన్నడూ గెలవలేదు. 2004లో వైఎస్ గాలి, 2019లో జగన్ గాలి వల్ల ఎమ్మెల్యేగా అయ్యారు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాత్రం స్వీయ చరిష్మాతో, ప్రజా బలంతో రికార్డు స్థాయి మెజారిటీ సాధించారు. ఇదే తేడా,” అని ధ్వజమెత్తారు.
అదేవిధంగా,
“నియోజకవర్గ చరిత్రలోనే అత్యంత అవినీతి ఎమ్మెల్యేగా కొట్టు రికార్డు సృష్టించారు. తన సొంత పార్టీ నాయకుల దగ్గరే లక్షల్లో లంచాలు తీసుకున్న ఘన చరిత్ర ఉంది. అలాంటి వ్యక్తి బొలిశెట్టి పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం” అని మండిపడ్డారు.
“కొట్టు నిజంగా అవినీతి చేయకపోతే తన ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి చెప్పాలి” అని సవాల్ విసిరారు.
జనసేన నేతలు బొలిశెట్టి ప్రజల కోసం ఎప్పుడూ ముందుండి కష్టాల్లో ఆదుకుంటారని కొనియాడారు.
“ఆయనకు నిజమైన ప్రజా బలం ఉంది. అందుకే మేమంతా ఆయన నాయకత్వానికి మెచ్చి జనసేనలో చేరాం. భవిష్యత్తులో కూడా ఒకే బాటలో నడుస్తాం. కొట్టు సత్యనారాయణను మళ్లీ ఎన్నడూ గెలవనివ్వం” అని హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో జనసేన, టిడిపి నాయకులు ఉంగరాల శ్రీనివాస్, మేడపాటి చెల్లారెడ్డి, పైబోయిన వైదేహి, చింతకాయల సత్యనారాయణ, అడ్డాల నరసింహారావు, చిత్తూరి నాగేంద్ర, దూద్ భాష, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
