*స్కౌట్ అండ్ గైడ్స్ లో ప్రతిభ చాటిన గురుకులం విద్యార్థులు*
— 9 విభాగాల్లో అవార్డులు కైవసం
— అభినందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
— విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత
తాడేపల్లిగూడెం–02 డిసెంబర్ 2025
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో జరిగిన స్కౌట్ అండ్ గైడ్స్ నేషనల్ జంబోరి శిబిరంలో పెద తాడేపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వివిధ విభాగాల్లో అవార్డులు సాధించారు మంగళవారం ప్రిన్సిపల్ రాజారావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగిన స్కౌట్ అండ్ గైడ్స్ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచి అవార్డులు సాధించడం అభినందనీయం అన్నారు ప్రతి విద్యార్థి విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక, స్కౌట్ అండ్ గైడ్స్ లాంటి కార్యక్రమాల్లో నైపుణ్య అభివృద్ధిని ప్రదర్శించి విజయం సాధిస్తే ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు త్వరితగతిన లభిస్తాయి అన్నారు ఎంచుకున్న రంగంలో విజయం సాధించే వరకు కృషి పట్టుదలతో ముందుకు సాగరన్నారు అదే స్ఫూర్తితో పెదతాడేపల్లి గురుకులం విద్యార్థులు నవంబర్ 23 నుంచి 29 వరకు లక్నోలో స్కౌట్ అండ్ గైడ్స్ జంబోరి లో జరిగిన 10 విభాగాల్లో గురుకులం విద్యార్థులు ప్రతిభ కనబరిచి 9 విభాగాల్లో నైపుణ్యం కనబరిచి గ్రేడ్స్ సాధించడం సంతోషం అన్నారు ప్రిన్సిపల్ రాజారావు మాట్లాడుతూ ప్రతీ 4 సంవత్సరాలకు ఒక సారి జరిగే నేషనల్ జంబోరి శిభిరము లో పాల్గొనడానికి విద్యార్థులను ప్రోత్సహించి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అన్నారు అంతే కాకుండా ఎమ్మెల్యే ఆఫీస్ ద్వారా విద్యార్థులు వెళ్లి వచ్చేవరకు మానిటరింగ్ చేయటం జరిగిందని తెలిపారు జంభో్రీ లో అన్నీ రాష్ట్రాల నుండి సుమారుగా 20 వేల మంది పాల్గొన్నారన్నారు. మన రాష్ట్రం ననుండి 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెడతాడేపల్లి గురుకులం విద్యార్థులు 56 మంది పాల్గొన్నారు. వీరు 10 పోటిల్లో పాల్గొనగా 9 పోటిల్లో మంచి గ్రేడ్స్ సాధించారన్నారు. ఈ గురుకులం విద్యార్థులు ప్రత్యేకంగా పాల్గొన్న బ్యాండ్ ప్రదర్శనకు (ఏ) గ్రేడ్ రావటం జరిగింది తెలిపారు విద్యార్థులు వివిధ విభాగాల్లో పాల్గొని కనపరిచిన ప్రతిభ అభినందనీయం అన్నారు సహకరించిన రాష్ట్ర,జిల్లాస్థాయి అధికారులకు, ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి వై. నారాయణ, సమగ్ర శిక్ష అధికారి శ్యామసుందర్, డిసిఓ ఉమాకుమారి, స్కౌట్ అండ్ గైడ్ సెక్రటరీ ఉంగరాల నాగేశ్వరరావు తదితరులు అభినందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
