51 వ ఫెయిత్ చర్చ్ రక్షణ మహోత్సవాలు గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు
తాడేపల్లిగూడెం డిసెంబర్ 6:
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ కొండయ్య చెరువు వద్దగల
51వ ఫెయిత్ చర్చ్ రక్షణ మహోత్సవాలు గ్రాండ్ క్రిస్మస్ పండుగ వేడుకలు డిసెంబర్ 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు మూడు రోజులు పాటు ఘనముగా నిర్వహించుచున్నామని బిషప్ డాక్టర్ జీ జే జ్యోతి ఆనంద్ శుక్రవారం విలేకరులకు తెలిపారు ఈ మూడు రోజుల రక్షణ మహోత్సవంలో శనివారం సువార్త తెలుపుటకు క్రైస్ట్ టెంపుల్ విజయవాడ డాక్టర్ పౌలు ఇమ్మానియేల్ పాల్గొంటారని తెలిపారు అదేవిధంగా ఏడవ తేదీ ఆదివారం వరల్డ్ ఇవాంజలిజమ్ ప్రపంచ ప్రవక్త ఎం. అనిల్ కుమార్ పాల్గొని ప్రజలకు సువార్త దైవ సందేశం తెలుపుతరని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, గూడెం టిడిపి ఇన్చార్జ్ రాష్ట్ర భవన నిర్మాణ నిర్మాణ కార్మికుల చైర్మన్ వలవల బాబ్జి, పాలూరి వెంకటేశ్వరరావు, పేరిచర్ల మురళీకృష్ణంరాజు ,యోగ్గిన నాగబాబు సబ్నావీసు కృష్ణమోహన్ మరియు పట్టణ పుర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు కావున గూడెం పట్టణ పరిసర ప్రాంతాల క్రైస్తవులందరూ పాల్గొని దైవ సందేశాన్ని వినాలని కోరారు
