పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం డిసెంబర్6:
తనను గుండెల్లో పెట్టుకుని గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి తాను రుణపడి ఉంటానని ఆ రుణాన్ని ప్రజా సమస్యల పరిష్కారం ద్వారా కొంత వరకు తీర్చుకోగలనని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడు మండలం దర్శిపరులో ప్రజాదర్బార్ కార్యక్రమంలో శుక్రవారం ఆయన ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శిపర్రు గ్రామంలో ప్రతినెల రూ.35 లక్షల 3500 పింఛన్ల రూపంలో ప్రభుత్వం అందిస్తుందని, తల్లికి వందనం ద్వారా తల్లులకు 81 లక్షల 12 వేల రూపాయలు ఇస్తున్నామన్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి 523చెక్ లు ద్వారా సుమారు 4కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందించామని గుర్తు చేశారు. అదేవిధంగా దర్శిపరు గ్రామంలో యల్లనాటి సమస్యగా ఉన్న ఆన్లైన్ భూముల రికార్డు పరిష్కరించామని రైతులు వారి భూమి ఆన్లైన్లో లేదని సతమతమవుతుంటే కలెక్టర్ తో మాట్లాడి ఈ సమస్య పరిష్కరించామన్నారు. అదేవిధంగా ఈయన భూముల సమస్య కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అత్యంత ఇబ్బంది కలిగించే రోడ్లు నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని జనవరి 1 నాటికి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించామని తెలిపారు. అభివృద్ధి నిరంతరం జరగాలన్నదే నా తపన అని ప్రజల సొమ్ము ప్రజలకే అందించాలని సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు. ఏ సమయంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. పుల్ల బాబి,కిలపర్తి వెంకటరావు, కోడే కాళీ, కోలా మార్కండేయులు, వాడపల్లి సుబ్బరాజు, కోలా శేషు వేణి పాలూరి వెంకటేశ్వరరావు ఎమ్మార్వో రాజేశ్వరి, స్పెషలాఫీసర్ ప్రభాకర్ రావు, ఎండిఓ తదితర అధికారులు పాల్గొన్నారు
