- సామర్థ్యం ఆధారంగా బోధన జరగాలంటూ ప్రభుత్వ టీచర్లకు డిఈఓ నారాయణ సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల తో G-FLAN పై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో నారాయణ విద్యార్థి సామర్థ్యం ఆధారంగా బోధన చేయాలని, ఎల్ఎస్ఆర్డ బ్ల్యు, చతుర్విధ ప్రక్రియలు ను తప్పకుండా చేయాలని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్ను కూడా విద్యార్థులతో చదివించాలని తెలిపారు. ఉదయం జరిపే జనరల్ క్లాసులతోపాటు మధ్యాహ్నం నిర్వహించే ఎఫ్ ఎల్ ఎన్ 75 రోజుల ప్రోగ్రాంను కచ్చితంగా అమలుపరచాలని తెలియజేశారు. పదవ తరగతి విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా పక్క పరణాళిక తో చదివించాలని కోరారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఇన్ టైంలో స్కూలుకు హాజరుకావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఉప విద్యాశాఖాధికారి రామాంజనేయులు, మండల విద్యాశాఖ అధికారి హనుమ, ఎంఈఓ -2 జ్యోతి, హెడ్మాస్టర్ సత్యనారాయణ,ఉపాధ్యాయులు,సిఆర్పి లు పాల్గొన్నారు.
