చిన్న వయసులో వివాహం చేసుకోవడం వల్ల చాలా అనర్థాలకు గురవుతారని డిసిపిఓ సూర్య చక్రవేణి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ విద్యార్థులకు మహిళలపై దాడులు నిర్మూలించడం, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏలూరు డిసిపిఓ సూర్యచక్రవేణి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ అతి చిన్న వయసులో వివాహాలు చేసుకోవడం వల్ల చాలా అనర్థాలకు గురవుతారని తెలియజేశారు, మహిళలపై చిత్రహింసలు గురి చేస్తే ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షిస్తుందని తెలిపారు, దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను అమల్లోకి తీసుకువచ్చిందని, ఈ చట్టాల వల్ల మహిళలకు ప్రత్యేక రక్షణ కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మహమ్మద్ ఇస్మాయిల్, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ దుర్గాభవాని, కే విశాలాక్షి, అడ్మినిస్ట్రేటర్ కృష్ణవేణి, లెక్చరర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
