Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

కోర్టు ముందు సీబీఐ హాజరు కాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐహెచ్ఎఫ్ఎల్)పై ఓ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసినప్పటికీ, సీబీఐ హాజరు కాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘సీబీఐ ప్రవర్తనను మేము అంగీకరించం. అత్యున్నంత న్యాయస్థానం నోటీసు జారీ చేసిన తర్వాత, వారు ఇక్కడికి రావాలి. సుప్రీంకోర్టు ముందు హాజరు కాలేమని ఎలా చెప్పగలరు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది.

కంపెనీకి చెందిన ప్రమోటర్లు నిధులను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కోసం దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు వీచరిస్తోంది. ఈ సందర్భంగా.. పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్..

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎటువంటి నేరం జరగనందున తాము చర్యలు తీసుకోలేమని చెప్పిందని అన్నారు. అనంతరం కేసు నమోదు చేయాలని సీబీఐని కోరుతూ ఓ దరఖాస్తు దాఖలైంది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆరోపణల స్వభావం దర్యాప్తు, కేంద్ర సంస్థల నివేదిక అవసరమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐకి నోటీసులివ్వగా, కోర్టుకు హాజరు కాలేదు.

సీబీఐ వారు కోర్టుకు రావడానికి కూడా ధైర్యం లేదా అని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, అందుకు వారం గడువు కోరిన పిటిషనర్ తరపు న్యాయవాదికి, సీబీఐ చర్యలు తీసుకునేందుకు అధికారిక ఫిర్యాదు అవసరంలేదని, ఇంకా అదనపు సమాచారం ఏమివ్వాలి? ఇప్పటికే వారి వద్ద రికార్డులు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఇక, ఇండియాబుల్స్ తరపు హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి.. కంపెనీ కొన్నేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దానిపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని అన్నారు. ఈ కేసును తదుపరి జూలై 30న విచారించనున్నట్టు కోర్టు పేర్కొంది.

Related posts

పాక్ కాల్పులలో జమ్మూ కాశ్మీర్ అధికారి మృతి-షాక్ లో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

M HANUMATH PRASAD

క్షీణించిన సోనియా గాంధీ ఆరోగ్యం.. గంగారాం ఆసుపత్రికి తరలింపు..

M HANUMATH PRASAD

భారత్- పాక్ యుద్ధంలో ఫైటర్ జెట్లు కోల్పోయాం.. సీడీఎస్ వెల్లడి

M HANUMATH PRASAD

రాష్ట్రపతికి సుప్రీం కోర్టు డెడ్‌లైన్‌ పెట్టొచ్చా.. ద్రౌపది ముర్ము సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

అలాంటి పదవులేవి నాకొద్దు.. CJI సంజీవ్ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

పాక్‌ సైన్యానికి సపోర్ట్‌గా సోషల్‌ మీడియా పోస్టులు.. గవర్నమెంట్ టీచర్‌పై సస్పెన్షన్‌ వేటు..!

M HANUMATH PRASAD