Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

గురుకుల విద్యార్థుల జంబోరి విజయం –రాష్ట్రానికి గర్వకారణం* — జాతీయస్థాయిలో ఏపీకి మూడవ స్థానం — 13 విభాగాల్లో అవార్డుల పంట — మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కలిసిన విద్యార్థులు — విద్యార్థులను అభినందించిన మంత్రి డోలా

*గురుకుల విద్యార్థుల జంబోరి విజయం –రాష్ట్రానికి గర్వకారణం*
— జాతీయస్థాయిలో ఏపీకి మూడవ స్థానం
— 13 విభాగాల్లో అవార్డుల పంట
— మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కలిసిన విద్యార్థులు
— విద్యార్థులను అభినందించిన మంత్రి డోలా

తాడేపల్లిగూడెం–16 నవంబర్ 2025

పెద తాడేపల్లి లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు లక్నోలోని జంబొరిలో సాధించిన విజయం రాష్ట్రానికి గర్వకారణం అని సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రిన్సిపల్ బి. రాజారావు స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులు మంత్రి డోలా ను సచివాలయంలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడలు సాంస్కృతిక స్కౌట్ అండ్ గైడ్స్ లాంటి వాటిలో రాణిస్తే ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు సులభంగా లభిస్తాయి అన్నారు జాతీయ స్థాయిలో జరిగిన జంబొరిలో దేశవ్యాప్తంగా 20వేల g మంది విద్యార్థులు స్కౌట్ అండ్ గైడ్ లో పాల్గొన్నారు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సుమారు 450 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు పశ్చిమగోదావరి జిల్లా నుంచి పెద తాడేపల్లి లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల చెందిన 56 మంది విద్యార్థులు పాల్గొని 9 విభాగాల్లో అవార్డులు సాధించారన్నారు, గురుకుల పాఠశాల సాధించిన విజయంతో జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడవ స్థానం లభించింది అన్నారు కృషిy పట్టుదలతో విద్యార్థులు సాధించిన అవార్డులు రాష్ట్రానికి గర్వకారణం అన్నారు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షించారు ఎంచుకున్న రంగంలో విజయం సాధించేందుకు కృషి పట్టుదలతో ముందుకు సాగాలన్నారు ప్రభుత్వం అందిస్తున్న విద్యా వనరులను సద్విని చేసుకుని నైపుణ్య అభివృద్ధిని పెంపొందించుకోవాలన్నారు విద్యార్థుల జంబోరి విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రిన్సిపల్ రాజారావును,ఉపాధ్యాయులను మంత్రి డోల అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ అదనపు కార్యదర్శి సునీల్ రాజ్ కుమార్, జాయింట్ కార్యదర్శి రూపావతి, స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related posts

రూ. 13.7 కోట్ల వాచీలో గడియారం లోపల సింహాలు, పులులు…

Arnews Telugu

పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

AR NEWS TELUGU

H-1B వీసాదారులకు షాక్.. 2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!

Arnews Telugu

తాడేపల్లిగూడెం భవిత కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు

Arnews Telugu

తాడేపల్లిగూడెంలో జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాల అవగాహన కార్యక్రమం

Arnews Telugu

కొట్టు అవినీతి, అసత్య ఆరోపణలు తిప్పికొడుతున్నాం: జనసేన నేతలు

Arnews Telugu