Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణపుణ్యక్షేత్రాలు

శబరిమలలో ఘనంగా మండల పూజ

  • శబరిమలలో ఘనంగా మండల పూజ…వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
  • తిరిగి 30న తెరుచుకోనున్న ఆలయం…

శబరిమల: అయ్యప్పస్వామి కొలువైన శబరిమలలో శనివారం మండలపూజ ఘనంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మణికంఠుడు దర్శనం చేసుకున్నారు.ఆలయ తంత్రి కందరారు మహేశ్ మోహనారు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహిం చారు. రాత్రి పదిగంటల సమయంలో స్వామికి పవళింపు కీర్తన హరివరాసనం ఆలపించిన అనంతరం ఆలయ ద్వారాలను లాంఛనంగా మూసివేశారు.దీంతో వార్షిక యాత్ర సీజన్లో 41 రోజుల పాటు సాగిన తొలిదశ ముగిసినట్లైంది. మకరవిలక్కు పూజల కోసం ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు ఆయ్యప్ప ఆలయ ద్వారాలను తెరుస్తారు. ఆ రోజు నుంచి వార్షిక యాత్ర సీజన్లో రెండో దశ మొదలవుతుంది.

Related posts

ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ అరెస్ట్

Arnews Telugu

యువత పెరుగుతున్నా.. ఉద్యోగాలే కరువు

Arnews Telugu

నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తీపికబురు

Arnews Telugu

గుడివాడ అద్దేపల్లి కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం…. కోట్లలో ఆస్తి నష్టం….

Arnews Telugu

పార్టీలకు అతీతంగా జనసేన కుటుంబంలో స్థానం – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu

వరుస సెలవులతో తిరుమలకు పోటెతిన్న భక్తులు

Arnews Telugu