Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
అంతర్జాతీయంజాతీయ వార్తలురాజకీయం

సబ్ మెరైన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

  • ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌ సబ్ మెరైన్ లో ద్రౌపది ముర్ము
  • కల్వరి క్లాస్ సబ్ మెరైన్ లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతి
  • కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరంలో జలాంతర్గామిలోకి ఎంట్రీ
  • గతంలో భారత రాష్ట్రపతి హోదాలో ఈ సబ్ మెరైన్ లో ప్రయాణించిన అబ్దుల్ కలాం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఉదయం నౌకాదళ జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరానికి చేరుకున్న రాష్ట్రపతి.. నేవీకి చెందిన కల్వరి క్లాస్ సబ్ మెరైన్ ‘ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌’ లో ప్రయాణించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంట నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి కూడా ఉన్నారు. కల్వరి క్లాస్ సబ్‌మెరైన్‌ లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు.గతంలో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కల్వరి క్లాస్ సబ్‌మెరైన్‌ లో ప్రయాణించారు. ఇదిలా ఉండగా, ద్రౌపది ముర్ము ఇటీవల హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం రఫేల్ లో ఆమె ప్రయాణించారు.

Related posts

ఏపీ లో మహిళలకు నెలకు రూ 1500

Arnews Telugu

రాబోయేది జగనన్న రాజ్యం వైస్సార్సీపీ ఎస్ఈసి మెంబెర్ కొట్టు నాగు

Arnews Telugu

పెళ్లి ప్రయాణీకుల బస్సు బోల్తా.. ఐదుగురు మృతి, 85 మందికి గాయాలు..!!

Arnews Telugu

శబరిమలలో ఘనంగా మండల పూజ

Arnews Telugu

ఏలూరులో  శ్రీ గంగానమ్మను దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత

Arnews Telugu

రూ. 13.7 కోట్ల వాచీలో గడియారం లోపల సింహాలు, పులులు…

Arnews Telugu