కూతురు కాపురాన్ని చక్కదిద్దానికి వెళ్లి సమన్యాయం కుదరలేదని తెలిసి కుమార్తె మనవరాలతో కలిసి చనిపోవాలని తల్లి గోదావరి దూకి గల్లంతయింది ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం కొవ్వూరు రోడ్ కం రైల్వే వంతెన పై చోటుచేసుకుంది. దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన ఈగల ధనలక్ష్మి (40) తన కుమార్తె విజయ కుమారిని మండపేటకు చెందిన భూసాల విజయ్ కుమార్ కి ఇచ్చి 2020లో వివాహం చేశారు వీరికి నాలుగేళ్ల కుమారుడు మోక్షిత్ యాడాదిన్నెర కుమార్తె లక్ష్మి ప్రసన్న ఉన్నారు. లారీడైవర్ గా పని చేసే విజయకుమార్ భార్యని వేధిస్తున్నాడని మనస్పర్ధలు కారణంగా చాలా రోజుల నుంచి ఘర్షణ పడుతున్నారు ఈ నేపథ్యంలో ధనలక్ష్మి శుక్రవారం కూతురు కాపురం చక్కదిద్దేందుకు ఉదయం మండపేట వెళ్లారు అక్కడగొడవలు జరగడంతో కుమార్తె మనవరాలతో కలిసి మధ్యాహ్నం బయటికి వచ్చేసారు ఆ సమయంలో మనవడు పాఠశాలకు వెళ్ళాడు అయితే ఈ ముగ్గురు రాజమహేంద్రవరం నుంచి గోదావరిలో దూకాలిఅని నిర్ణయించుకున్నారు ఆటోలో వంతెన పైకి వచ్చారు కొంచెం దూరం నడిచాక ఉన్నట్టు ఉండి ధనలక్ష్మి గోదావరిలో దూకారు. ఆ వెంటనే కూతురు గోదావరిలో దూకపోగా స్థానికులు అడ్డుకున్నారు అక్కడే రోధిస్తున్న విజయ కుమారిని చిన్నారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి ఓదార్చరు గల్లంతయిన ఈగల ధనలక్ష్మి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు
previous post
