జర్ఖండ్ రాష్ట్రం లతహార్ జిల్లా మహువాడండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్సా వ్యాలీ ప్రాంతంలో బస్సు(15AB0564) బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోగా.. 85మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మహువాడండ్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులోని ప్రయాణికులు ఛత్తీస్ గఢ్ లోని బలరాంపూర్ నుంచి లోధ్ ఫాల్ కు స్కూల్ బస్సులో వెళ్తున్నట్లు సమాచారం. వీరంతా పెళ్లి కార్యక్రమానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.ప్రమాదాన్ని చూసిన వెంటనే స్థానికులు, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 90 మందికి పైగా ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ బస్సు కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు మహిళల మృతదేహాలను వెలికితీశారు. బస్సు కింద మరిన్ని మృతదేహాలు కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.బస్సులోని ప్రయాణీకులు ఛత్తీస్‌ఘడ్ లోని బలరంపూర్ జిల్లా నుంచి లేట్హార్లోని మహువాదండ్‌లో జరిగిన వివాహానికి వెళ్లినట్టు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ కుమార్ గౌరవ్ తెలిపారు.మృతులు.. రేసంతి దేవి (35), ప్రేమ దేవి (37), సీతా దేవి (45) సుఖ్నా భూయాన్, సోనమతి దేవి (55)గా గుర్తించారు. గాయపడిన వారిలో 85 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అకస్మాత్తుగా బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ బస్సును నియంత్రించలేక ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.
previous post
next post
