గ్రావెల్ అక్రమ రవాణాపై విజిలెన్సు కొరడా – భారీ జరిమానాలు విధింపు
తాడేపల్లిగూడెం | జనవరి 28, 2026:
గ్రావెల్ అక్రమ రవాణాపై విజిలెన్సు అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. అక్రమంగా గ్రావెల్ రవాణా జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ SP K. నాగేశ్వర రావు ఆదేశాలపై తాడేపల్లిగూడెం మరియు తణుకు పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో విజిలెన్సు, మైన్స్ మరియు రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు. ఆరుగొలను గ్రామం నుంచి అక్రమంగా గ్రావెల్ రవాణా జరుగుతున్నట్లు గుర్తించి మూడు యూనిట్ల గ్రావెల్ లారీ ఒకటి, ఆరు యూనిట్ల గ్రావెల్ లారీలు ఐదును తనిఖీ చేశారు.
తనిఖీల్లో సంబంధిత లారీలకు మైనింగ్ అనుమతులు, బిల్లులు లేకపోవడం, అలాగే అధిక లోడుతో గ్రావెల్ రవాణా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మైనింగ్ అపరాధ రుసుముగా రూ.66,000లు, అధిక లోడుకు సంబంధించి అపరాధ రుసుముగా రూ.2,56,000లు విధించారు.
ఈ సందర్భంగా అక్రమంగా గ్రావెల్ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ SP K. నాగేశ్వర రావు హెచ్చరించారు. అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ఈ సంయుక్త తనిఖీల్లో విజిలెన్సు AG P. శ్రీధర్, విజిలెన్సు ఇన్స్పెక్టర్ D. ప్రసాద్ కుమార్, విజిలెన్సు SI Ch. రంజిత్ కుమార్, విజిలెన్సు SI K. సీతారాము, మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ P. అన్నపూర్ణ, రవాణా శాఖ అధికారి K.V. సత్యనారాయణ పాల్గొన్నారు.
next post
