Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌కు షాకిచ్చిన సర్కార్‌.. పదవి నుండి తొలగింపు..

పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్‌ ఛైర్మన్‌కు షాకిచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మున్సిపల్‌ చైర్మన్‌ పదవి నుండి తురఖా కిషోర్ ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది..

ఏపీ మున్సిపల్ యాక్ట్ లోని సెక్షన్ 16(1)(కె )ను ఉల్లంఘించినందుకు తురఖా కిషోర్‌ను మున్సిపల్‌ చైర్మన్‌ పదవి నుంచి తొలగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.. 15 కౌన్సిల్ మీటింగులకు ఆయన హజరుకాలేదని తేలడంతో పదవినుండి తొలగించినట్టు వెల్లడించింది.. ప్రస్తుతం పోలీసుల అదుపులో తురకా కిషోర్ ఉన్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కార్‌.. ఛైర్మన్ అధికారాలను దుర్వినియోగం చేసిన కేసులో చర్య ఎందుకు తీసుకోకూడదని ఇప్పటికే కిషోర్ కు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం.. కానీ, ఆ నోటీసులకు ఎలాంటి సమాధానం కిషోర్‌ నుంచి రాలేదు.. దీంతో, మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్న తురఖా కిషోర్‌ను పదవి నుండి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఏపీ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్..

Related posts

వివాదాల చుట్టూ చెన్నై ఆంధ్రా క్లబ్ ఎన్నికలు

రఘురామ కేసులో కీలక పరిణామం:సునీల్ నాయక్ కు మరో రిలీఫ్..!

M HANUMATH PRASAD

హంతకుడు అప్పలరాజుకు ఉరిశిక్ష విధించిన విశాఖ కోర్టు

M HANUMATH PRASAD

తాము యుద్ధం కోరుకోవటం లేదంటూ పాకిస్తాన్ అధికారిక ప్రకటన

వలంటీర్లలా చేయలేం!

M HANUMATH PRASAD

మహా నాడు కాదు దగా నాడు – పేర్ని నాని

M HANUMATH PRASAD